దిగులు కాండం మీద...

వాడి దగ్గర
వాడిదంటూ ఏమీ ఉండదు
ఎప్పుడైనా తన దగ్గరేమైనా
ఉందని చెబితే అది అబద్ధమే


పూనకం వచ్చినప్పుడు
గాలిలో చెయ్యి ఊపి
ఒకట్రెండు బతుకు ముక్కల్ని
గుప్పిట్లోకి తీసుకొని
తడి తడి పదాల కుప్పలు పోస్తాడు
కుప్పలు పడిన పదాల్ని
విప్పారిన కళ్ళతో చూస్తాడు
పదాలు కాసేపు వాడితో
నవ్వుతాయి ఏడుస్తాయి
చూస్తుండగానే ఏడుస్తాయి
చూస్తుండగానే చెప్పులేసుకుని
వాడికి టాటా చెప్పి ఎటో వెళ్లిపోతాయి


ఒక్కోసారి పిల్లలకు పొదుగు వదిలి
మైమరిచి పడుకున్న కుక్కలా
వాడు కళ్ళూ ఒళ్లూ మూసుకుని
పదాల పెదాల స్పర్శకు పులకిస్తాడు
అవి వీధుల్లోకి వెళ్ళి గంతులేస్తుంటే
సంబర పడతాడు
ఎప్పుడో
వాడు మాగన్నుగా పడుకున్నప్పుడు
వాటిని ఎవరో ఎత్తుకుపోతారు


దిగులు కాండం మీద
చిన్న పువ్వై
మళ్ళీ వాడొక్కడే ...

-కళానిధి

2 comments:

  1. endi raa aa poem.. waste felloww..
    kukka pillalu adi idi ani rasesav!!!!!

    ReplyDelete
  2. @K.Durga Prasad,
    కాదేది కవితకు అనర్హం అనే మాటలను గుర్తుంచుకో....
    అది పద్యము కాదు కవిత్వము

    ReplyDelete